కోహ్లీ చూసింది అది కాదు

సోషల్ మీడియలో ఏ చిన్న విషయమైన రచ్చరచ్చ కావాల్సిందే. వైరల్ అయ్యే ఫోటోలు కానీ, వీడియోలు కానీ. అందులో అర్ధం లేకున్నా లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తారు కొంతమంది. తాజాగా ఇలాంటి సంఘటనే రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అర్చన విజయకి మధ్య జరిగింది.  ఐపీఎల్ సీజన్ లో తన అందంతో పాటు యాంకరింగ్ తో అదరగొట్టేస్తున్న ఈ అమ్మడు విరాట్ ను ఇంటర్వ్యూ చేసింది.
మాట‌ల సంద‌ర్భంలో కోహ్లీ .. యాంకర్ చిరిగిన జీన్స్ ప్యాంటు వైపే చూస్తున్న‌ట్టుగా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వాస్తవానికి కోహ్లీ చూసింది ప్ర‌శ్న‌ల కార్డును..కానీ కొందరు నెటిజన్లు దీనికి మరోలా అర్ధం తీస్తూ కోహ్లీతో పాటు, అర్చ‌న మీద కూడా దారుణ‌మైన కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకడంతో అర్చన ఆ ఫోటోపై వివరణ ఇచ్చింది.
ఓరి దేవుడా పరువు తీయడానికి మీరు ఎంతకైనా తెగిస్తారు. కోహ్లీ చాలా మంచివాడు.
కోహ్లీ చూసిన చూపుపై మీరు తప్పుగా అర్ధం చేసుకోవద్దు. చిరిగిన ఫ్యాంట్  కాదు. నా చేతిలో ఉన్న‌ క్యూ కార్డు వైపే త‌ప్ప‌ మ‌రోటి కాదు…” అని లబోదిబోమంది. భారతీయులు మహిళలపై ఉన్న ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. సాధారణ స్థాయి ఆటగాడి నుంచి కెప్టెన్ ఎదిగిన కోహ్లీ వ్యక్తిత్వం గురించి కామెంట్ చేయడం చాలా దారుణమని మండిపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here