బాహుబలి రైటర్ రాసిన కొత్త కథ .. ఆరంభ్

కలక్షన్ ల వర్షం తో బాహుబలి అందరినీ తడిపి ముద్ద చేస్తున్నాడు. బాహుబలి లాంటి మహా గొప్ప కథ ని అందించిన విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు మరొక కొత్త కథతో రాబోతున్నారు. టీవీ సిరీస్ తో రాబోతున్న విజయేంద్ర ప్రసాద్ ఈ పెద్ద ప్రాజెక్ట్ కి ఆరంభ్  అని పేరు పెట్టారు. తానె స్వయంగా కథ ఇస్తూ స్క్రీన్ ప్లే కూడా రాస్తున్నారు. పలు భాషల్లో స్టార్ నెట్వర్క్ ఛానల్స్ లో ఈ సీరియల్ రాబోతోంది.

దేవ సేన వరుణ దేవా యొక్క ప్రేమ కథగా ఈ సీరియల్ ఉంటుందట. వరుణ దేవుని పాత్రలో రజనీష్ దుగ్గల్, దేవసేనగా హీరోయిన్ కార్తీక నటిస్తున్నారు. గోల్డీ బెహల్ దర్శకత్వంలో రానున్న ఈ సీరియల్ కోసం భారీ సెట్స్, విజువల్ గ్రాఫిక్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది. గ్రాఫిక్స్ విషయం లో బాహుబలి ని ప్రేరణ గా తీసుకుని ఆ రెండు భాగాలకి పనిచేసిన కొందరు నిపుణులని ఈ సీరియల్ కి కూడా తీసుకునే పనిలో ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here