ప‌ప్పుపై గూగుల్ కు లేఖ రాయ‌నున్న నారాలోకేష్

ప్ర‌త్య‌ర్ధి పార్టీల్ని ఇరుకున పెట్టేందుకు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తుంటారు. సంద‌ర్భానుసారం ఎక్కువ‌గా నేను నిప్పు… నా జోలికెస్తే మాడి మసైపోతారు అంటూ విమ‌ర్శిస్తారు. అయితే దీన్ని అస్త్రంగా మ‌లుచుకున్న వైసీపీ నేత‌లు చంద్ర‌బాబు, నారాలోకేష్ లు నిప్పు కాదు ప‌ప్పు అని ఎద్దేవాచేస్తుంటారు. అయితే మంత్రి నారాలోకేష్ తాను పప్పును కాదు నిప్పు అని నిరూపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతున్నాయి.

ఇందులో భాగంగా ఐటీ మంత్రి అయిన లోకేష్ గూగుల్ కు లేఖ రాస్తున్న‌ట్లు తెలుస్తోంది. గూగుల్ ప‌ప్పు అని కొడితే త‌న ఫోటోలు ఎందుకు వ‌స్తున్నాయో  అయోమయంలో ఉన్న లోకేష్ గూగుల్ సంబంధిత ఎస్ఈఓ విభాగంలో నిపుణులతో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. వాళ్లు తెలిపిన వివ‌రాల ఆధారంగా త‌ప్పు ఎక్క‌డ జ‌రుగుతుందో  సరిదిద్దే ప్ర‌య‌త్నం చేయాల‌ని గూగుల్ ను కోరనున్నాడ‌ట‌. బ‌హుశ అదేజ‌రిగితే గూగుల్ లో సెర్చ్ చేస్తే ప‌ప్పు అంటే లోకేష్ ఫోటోలు రాక‌పోవ‌చ్చ‌ని తెలుగు త‌మ్ముళ్లు అభిప్రాయం వ్య‌క్తంచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here