పవన్ కు ఇది ఎందుకు కనిపించలేదు..

ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా నినాదాన్ని విజయవంతంగా అణిచివేసిన కేంద్ర ప్రభుత్వం తన చర్య పట్ల ఏనాడూ తప్పు చేసిన ఫీలింగ్ కలిగించుకోలేదు. పై పెచ్చు ఇది ఓ ఘనకార్యం లాగా తెలుగువాడైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తో భజన తాళం వేయించి మరీ అందరి నోరు మూయించింది. దాని కన్నా అందరు గొంతెత్తి అరుస్తున్నా వినపడనట్టు నటించింది అనటం కరెక్ట్. వైజాగ్ లో చేపట్టదలచిన నిరసన కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు సర్కార్ సహాయంతో సమ్మిట్ పేరు చెప్పి మరీ తొక్కేసింది.

అప్పుడు కూడా పవన్ ట్వీట్లతోనే సరిపుచ్చాడు. అప్పుడు పవన్ చెప్పింది ఒకటే మాట. ఉత్తరాది వారి అధికార దాహానికి అహంకారానికి మనం బలిపశువులం అవుతున్నాం అని. మరి ఎన్నికలప్పుడు మోడీ రాష్ట్ర ప్రచారానికి వచ్చినప్పుడు మరి దక్షిణాది వారిలాగా కనిపించారేమో. ఈ ప్రశ్న మాత్రం ఎవరు అడగలేకపోయారు. పవన్ చేసిన ఈ కామెంట్స్ పట్ల అప్పుడు కొంత వ్యతిరేకత కూడా వచ్చిది. అసలు జనం మనసులో లేని ఉత్తర, దక్షిణ రాష్టాలు అని కొత్తగా విభేదాలు సృష్టించినట్టు అవుతుందని అభ్యంతరం కూడా వ్యక్తం చేసారు. కాని పవన్ ఇప్పుడు దానికి సంబందించిన విషయంలో సైలెంట్ గా ఉండటం కొత్త చర్చకు అవకాశం ఇస్తోంది.

టిటిడి నూతన ఈవో గా సింఘాల్ నియమితులయ్యారు. ఈయన ఉత్తరాది వ్యక్తి. సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్. ఏడుకొండల వాడు అంటే విపరీతమైన భక్తి. అది మాత్రమే కాదు అర్హత. ఈయనకు కమల దళం నుంచి అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఇప్పటికే పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు దక్షిణాది సీనియర్ ఐఎఎస్ ల సంఘం దీని మీద ఫైర్ అవుతోంది. ఇక్కడే అర్హత కలిగిన సీనియర్ ఆఫీసర్లు ఎందరో ఉండగా సింఘాల్ ని పిలపించడం ఏమిటి అని నిలదీస్తున్నారు.

కొందరు పీటాధిపతులు కోర్ట్ కు సైతం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మరి ఉత్తరాది అహంకారం అని గొంతెత్తిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టిటిడి ఈవో పదవి కళ్ళ ముందే ఉత్తరాది వారికి కట్టబెడుతుంటే కనీసం ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం కూడా చేయటం లేదు. బిజెపి, టిడిపి కి పవన్ ఎప్పటికి అస్మదీయుడే అనే మాటను నిజం చేస్తూ ప్రవర్తించడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. ఎలాగూ నేరుగా చెప్పలేడు కాబట్టి కనీసం ట్విట్టర్ ద్వారా అయినా పవన్ ఈ విషయం గురించి ప్రస్తావించి ఉంటె బాగుండేది. అలా చేయలేదు అంటే అవకాశవాదం అనుకునే ప్రమాదం ఉంది. ఏమంటారు పవన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here