కేసీఆర్ ఓడిపోతే ..రేవంత్ రెడ్డే సీఎం

రాజ‌కీయం అంటే ఇదినోయ్..!  రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. మిత్రులు శ‌త్రువులు  కావ‌చ్చు. శ‌త్రువులు  మిత్రులు కావ‌చ్చు. బండ్లు ఓడ‌లు ..ఓడ‌లు బండ్లు కావ‌చ్చు. అందుకే రాజ‌కీయంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌క పార్టీ అధినేత‌లు సైతం త‌మ అనుచ‌రుల‌పై ఓ క‌న్నేసి ఉంచుతారు. ఇదిలా ఉంటే 2018 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ ఓడిపోతే ఆస్థానం భ‌ర్తీ చేసే నాయ‌కుడు ఎవ‌ర‌నేదానిపై బెంగ‌ళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ స‌ర్వే నిర్వ‌హించింది.

ఈ స‌ర్వేల్లో అనూహ్యంగా కేసీఆర్ ఓడిపోతే ఆస్థానాన్ని భ‌ర్తీ చేసే ద‌మ్ము రేవంత్ రెడ్డికే ఉంద‌ని ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు ఆసంస్థ ప్ర‌క‌టించింది. కేసీఆర్ ను త‌ట్టుకోని ప్ర‌జావ్య‌తిరేక ప్ర‌భుత్వ విధానాల్ని ఎండ‌గ‌ట్టే స‌త్తా రేవంత్ కు ఉంద‌ని అంటున్నార‌ట‌.
ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 15 మధ్య 13 వేల పోలింగ్ బూత్ ల పరిధిలో ఒక లక్షా 19 వేల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుని ఈ సర్వే ఫలితాన్ని లెక్కగట్టారు.
ఈ సర్వేలో 47.45 శాతం మంది మళ్లీ సీఎంగా కేసీఆర్‌కే ఓటేశారు. తర్వాత టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డికి 19.16 శాతం అండగా నిలిచారు.ఇదిలా ఉంటే మ‌ళ్లీ కేసీఆర్నే సీఎం చేయాల‌ని కోరుకుంటున్న‌ట్లు వెల్ల‌డైంది. మ‌రో విష‌యం ఏంటంటే టీడీపీ త‌న ప్రాబ‌ల్యాన్ని కోల్పోతున్న త‌రుణంలో రేవంత్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్న‌ట్లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీన్ని బ‌ట్టే చూస్తే పార్టీ తో సంబంధంలేకుండా రేవంత్ రెడ్డికే ఆ స్టామీనా ఉంద‌ని ఆయ‌న మ‌ద్ద‌తు దారులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here