ఢిల్లీలో ప్రత్యేకహోదా ఆందోళనలో పాల్గొన్న కత్తి మహేష్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ నాయకులు ఢిల్లీలో ఆందోళనలో నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది మేధావులు అనేక రాజకీయ పార్టీ నాయకులు ఆందోళనలో పాల్గొనడం జరిగింది. ఈ ఆందోళ‌న‌లో ప్ర‌త్యేక హోదా కోసం నేను సైతం అంటూ సినీ క్రిటిక్ మ‌హేష్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ.. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం పోరాడాల్సిన అధికార పార్టీ చేతులు ముడుచుకుని ఉంద‌న్నారు.
పోరాడాల్సిన స‌మ‌యంలో పోరాడ‌కుండా.. మిత్ర ధ‌ర్మ‌మంటూ బీజేపీ, టీడీపీ పార్టీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయ‌న్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు పాట్న‌ర్ ఒక‌సారి టీడీపీకి మ‌ద్ద‌తు తెలుపు.. మ‌రోసారి చంద్ర‌బాబును తిడుతూ.. చంద్ర‌బాబులానే రెండు నాల్కుల దోర‌ణి అవ‌లంభిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. చంద్ర‌బాబు నోటుకు ఓటు కేసుకు భ‌య‌ప‌డి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ప్యాకేజీ కోసం ఆశ‌ప‌డి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నార‌న్నారు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కోసం జనసేన పార్టీ పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబునాయుడు కాపాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించరు కత్తి మహేష్. ఈ సందర్భంగా ఈ ఆందోళనలో కతిమహేష్ పాల్గొనడంతో సోషల్ మీడియాలో నెటిజ‌న్లు ఇతర నిజమైన హీరో అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here