వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ హీరో మమ్ముట్టి

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బయోటెక్ హవా నడుస్తుంది. అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్ మహానటి గా వస్తుంటే…స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర 3 సినిమాలుగా రావడం విశేషం. అయితే ఈ నేపథ్యంలో మరో సంచలనకరమైన బయోపిక్ వస్తున్నట్లు తెలుస్తుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రను యాత్ర అనే సినిమా టైటిల్ తో ప్రముఖ దర్శకుడు మహి వి.రాఘవ్ తిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి .. రాజశేఖర్ రెడ్డి పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రలో ‘పాదయాత్ర’ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందువలన ఈ సినిమాకి ‘యాత్ర’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు సినిమా యూనిట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here