డైరెక్టర్ గా నిత్యామీనన్

నిత్యా మీనన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ఇటీవల నాని నిర్మించిన అ ! సినిమాలో లెస్బియన్ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ నేపథ్యంలో నిత్యామీనన్ డైరెక్టర్ గా మారుతున్నట్లు తెలుస్తుంది. తనకు సినిమా ప్రపంచం అంటే చాలా ఇష్టమని అందుకే తాను దర్శకురాలిగా మారేందుకు సిద్ధం అవుతుందట.
ఈ విషయాన్ని ఆమె ఓ సందర్బంగా మాట్లాడుతూ .. నిర్మాతగా చేయడం తనవల్ల కాదని .. కానీ ఖచ్చితంగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెబుతుంది. నటిగా భిన్నమైన సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు కేవలం .. సింగిల్ పాత్రతో ఓ సినిమాలో ప్రయోగం చేస్తుంది. వైవిధ్యమైన కథలతో పాత్రలతో వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది నిత్యామీనన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here