ప్రత్యేకహోదా అంశాన్ని చనిపోకుండా బ్రతికించిన నాయకుడు జగన్

ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేవలం వైసీపీ అధినేత జగన్ మాత్రమే తీసుకొస్తాడని ఆంధ్ర ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయములో వైసిపి అధినేత జగన్ ఆదినుండి ఒకే తాటిపై ఉండటం జరిగింది. జగన్ కేవలం ప్రత్యేక హోదా వల్ల మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందని అని నమ్మడం. గత ఎన్నికలలో చంద్రబాబు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాలు ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే ఎన్నికలలో గెలిచిన తరువాత కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల చంద్రబాబు తన రాజకీయ మనుగడ కోసం ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేక హోదా వల్ల ఏమీ ఉండదు ప్రత్యేక ప్యాకేజీ తో రాష్ట్రం బాగుపడుతుందని తన ఎల్లో మీడియా ద్వారా కథనాలు ప్రచురించడం ప్రజలలో చేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా అనుకున్న సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న ప్రధాన అంశంగా చేర్చి ప్రతి జిల్లాలో యువభేరి లు నిర్వహించి ప్రత్యేక హోదా ప్రాముఖ్యతను విద్యార్థులకు యువకులకు చెప్పడం జరిగింది.ఈ నేపథ్యంలో చంద్రబాబు చేప‌ట్టాక ప్ర‌త్యేక హోదా ఏమ‌న్నా సంజీవ‌నా..? అని అంటూ త‌న కుఠిల రాజ‌కీయాన్ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు.
ఇదిలా ఉండ‌గా.. నాడు రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యం నుంచి.. నేటి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా అనే అంశం ఇంకా ప్ర‌జ‌ల నోట్లో నానుతుందంటే అందుకు కార‌ణం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని చెప్పుకోక త‌ప్ప‌దు. అధికారంలో లేక‌పోయినా.. ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వంతోనూ.. అటు కేంద్ర ప్ర‌భుత్వంతోనూ పోట్లాడుతూ ప్ర‌త్యేక హోదా అనే అంశంపై పోరాటాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే క్ర‌మంలో వైఎస్ జ‌గ‌న్ వైఎస్ఆర్‌సీపీ ఎంపీల చేత రాజీనామా చేయించుందుకు కూడా వెనుకాడ‌లేదు.
మార్చి6వ తేదీ లోపు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా అంశంపై నిర్ణ‌యం తీసుకోకుంటే వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తాన‌ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇంతలా పోరాటం చేస్తున జగన్ ని చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ జగన్ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ పరిణామంలో ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలందరూ నమ్ముతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here