చిరంజీవి ఎక్కడా?: కత్తి మహేష్

మొన్నటివరకూ పవన్ కళ్యాణ్ పై అతని అభిమానుల పై ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్. తాజాగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ని టార్గెట్ చేశాడు కత్తి మహేష్. ఇటీవల కేంద్రం ప్రకటించిన బడ్జెట్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది పార్లమెంట్ ఉభయ సభలలో ఆందోళన నిర్వహించారు రాష్ట్రానికి చెందిన ఎంపీలు. అయితే ఈ సందర్భంగా సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ మెగాస్టార్ చిరంజీవి పై సంచలన ట్వీట్ చేశారు. ఏపీ ఎంపీలు జరిపిన ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కనిపించకపోవడం పట్ల విమర్శలకు దారితీస్తుంది.

ఈ సమయంలో చిరంజీవి ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే విషయమై కత్తి మహేశ్‌ ట్విటర్‌లో స్పందించారు. ఎంపీ కొణిదెల చిరంజీవి కనిపించుట లేదని కత్తి మహేశ్‌ ట్వీట్‌ చేశారు.మొన్నటి వరకూ మెయిన్ మీడియా సోషల్ మీడియా పవన్ కత్తి వివాదం అనేక వివాదాలకు దారి తీసి ముగిసిపోయింది. అయితే ఈ క్రమంలో కత్తి మహేష్ చిరంజీవి మీద చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here