దేశంలో రాహుల్ గాంధీ పెద్ద పప్పు : కేటీఆర్

లంగాణ ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి తనయుడు మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. ఏ క్రమంలో తెలంగాణ పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కి సవాలు విసిరారు కేటీఆర్. రాబోయే ఎన్నికలలో తెలంగాణలో  ప్రభుత్వం నెలకొల్పేది  టిఆర్ఎస్ పార్టీ అని ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నానని సవాలు విసిరారు ఉత్తమ కుమార్ రెడ్డికి మంత్రి కేటీఆర్.అంతేకాకుండా సన్యాసం సవాళ్లకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, పాలేరు ఉప ఎన్నికల్లో సవాల్ చేశాను.కాంగ్రెస్ పారిపోయింది.

25 ఏళ్ల‌ రాజకీయ జీవితాన్ని ప‌ణంగా పెట్టి కాంగ్రెస్‌కు సవాల్ చేశాను. సవాల్‌ను స్వీకరిస్తే ధైర్యంగా ముందుకు రావాలి. కుటుంబం చాటున రాజకీయాలు ఎందుకు? నా సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉత్తమ్‌కు ఉన్నా లేకపోయినా నేను నా మాటపై నిలబడతా. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే నా సవాళ్లకు నేను కట్టుబడి ఉంటాం కేటీఆర్. భార్య‌ను ఎమ్మెల్యేగా ప‌ద‌విలో ఉంచిన ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి వార‌స‌త్వ రాజ‌కీయాల వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అని అన్నారు మంత్రి కేటీఆర్. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడాల్సి వస్తుందని అన్నారు మంత్రి కేటీఆర్.

ఇంక రాహుల్ గాంధికి పెళ్లి కూడా కాలేదు అని సెటైర్ వేశారు.సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు మీ నాయకుడు రాహుల్. రాహుల్ గాంధీ పప్పు అని దేశం మొత్తం తెలుసు అని అన్నారు మంత్రి కేటీఆర్. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరికలు జారీచేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి దద్దమ్మ అన్ని తిట్టడం సమంజసం కాదని స్పష్టం చేశారు కేటీఆర్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here