చంద్రబాబు మీద సంచలన కరమైన వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి!

తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కి తీవ్ర అన్యాయం జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎంపీలు గ్రహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వంపై. అంతేకాకుండా కేంద్రం రాష్ట్రం పట్ల చేసిన అన్యాయాన్నికి అంతేగాక ఈనెల 8న ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. అయితే కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ కూడా అదికార టీడీపీ నాయకత్వం ఏమీ సాధించలేకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కి సంబంధించిన అనంతపురం ఎంపీ జెసి దివాకరరెడ్డి తనదైన స్టైల్లో కామెంట్ చేశారు.
బడ్జెట్‌లో ఏపీపై బండను తీసి గుండు పెట్టినట్టుగా ఉందన్నారు.పంగనామాలు పెట్టేశారన్నారు. బడ్జెట్‌లో మంచి ఇంగ్లీష్ వాడారని కితాబిచ్చారు. చంద్రబాబు తిరిగిన ఖర్చులకైనా వచ్చిందా అని ప్రశ్నించగా.చంద్రబాబు ఖర్చుల సంగతి తెలిస్తే అప్పుడు చెప్పవచ్చన్నారు. చంద్రబాబు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అని చెప్పారు జెసి దివాకర్ రెడ్డి.
అయితే ఈ క్రమంలో బడ్జెట్ లో కేంద్రం రాష్ట్రాన్ని చులకనగా చూడడం చంద్రబాబు వల్లే అంటున్నారు చాలామంది అని మీడియా దివాకర్ ని ప్రశ్నించగ్గా చంద్రబాబు మీదకు తోసేయక ఏం చేయాలో చెప్పండి అంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎంపీలుగా ఉన్నాము కానీ రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయములో కూడా మమ్మల్ని ముందుకు కదలనివ్వలేదు చంద్రబాబు అనే జేసి దివాకర్ రెడ్డి సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here