కనిపించిన దేవుడికల్లా ముద్దు పెడుతున్నారా..? అది చాలా పెద్ద తప్పు

హిందు సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు నెలవై ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా దైవార్చన. దేవుని పూజలు కొన్ని పద్దతుల్ని అవలంభించి పూజలు చేయాలి. అలా చేస్తేనే దేవుడి అనుగ్రహం పొంది అనుకున్న పని ఎంత కష్టతరమైన ఇట్టే తీరుతుందని విశ్వాసం. అయితే భగవంతుని స్మరించుకోవడంలో కొన్ని పద్దతుల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారంగా మనకు ఎక్కడైనా దేవుడు ఫోటో కనిపిస్తే కళ్లకద్దుకోని ముద్దు పెట్టుకొని దేవుడిని స్మరిస్తుంటాం. అది చాలా తప్పని పెద్దులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండదట. అందుకే పెద్దలకు నమ్మస్కారం చేయాలన్నా..గుడిలో హారతి తీసుకోవాలన్నా రెండు చేతులతో చేయాలి.

అలా కాకుండా ఒక్క చేత్తో చేయడకూడదు. సహజంగా దేవాలయం, దేవుడి విగ్రహాలు కనిపిస్తే కళ్లకద్దుకోవడం, ముద్దుపెట్టుకోవడం, గుండెల మీద చేయి వేసుకోవడం చేస్తుంటాం. అలాకాకుండా దేవుడిని మనసులో స్మరించుకోవాలి. కళ్లకద్దుకోవాలి, రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here