ఖైదీ 150 నాది .. నేనే రెజెక్ట్ చేశా .. – మహేష్

ఒక సినిమా రీమేక్ అయితే ఆ సినిమాని తమ భాషలో తమ నేటివిటీ తో చూపించాలి అని ప్రొడ్యూసర్ లు తెగ హైరానా పడిపోతూ ఉంటారు. ఆ సినిమా కి ఆ భాష లో ఎంత హక్కు ఉన్నా ఆ రేటు ని ఇచ్చేసి సినిమా కొనుక్కుందాం అని చూస్తూ ఉంటారు స్టార్ డైరెక్టర్ లు , నిర్మాతలు. ఇక తెలుగు లో ఒక పెద్ద హీరోకి రీమేక్ చెయ్యాలి అనిపించింది అంటే ఆ సినిమా ఎంతటిది అయినా కొనేస్తారు. కానీ తన కెరీర్ లో ఎప్పుడూ రీమేక్ లు చెయ్యని హీరోగా మహేష్ బాబు కనిపిస్తాడు.

అదే విషయం మహేష్ ని అడిగితే కత్తి రీమేక్ కూడా మొదట తన దగ్గరకే వచ్చింది అనీ కానీ తానే రిజెక్ట్ చేసాను అనే చెబుతున్నాడు.  ‘కత్తి’ (తెలుగులో ఖైదీ నంబర్ 150) రీమేక్ కూడా తొలుత నా దగ్గరకే వచ్చింది.అయితే ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తేనే చేస్తానని చెప్పాను. ఆయన హిందీ సినిమాతో బిజీ గా ఉన్నారు అందుకే కొత్త కథ తో స్పైడర్ తీసాం అన్నాడు మహేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here