హిందువులు తీవ్రవాదులు – కమల్ హసన్ వివరణ

రాజ‌కీయ పార్టీ పెట్ట‌బోతున్న సినీన‌టుడు క‌మ‌ల హాస‌న్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి, హిందువుల ఆగ్ర‌హానికి గురైన విష‌యం తెలిసిందే. ఈ రోజు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మీడియాతో క‌మ‌ల‌ హాస‌న్ మాట్లాడారు. తాను ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించ‌కూడ‌ద‌ని అన్నారు. తాను మొన్న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఉగ్ర‌వాదులు అన్న ప‌దాన్నే అస్స‌లు వాడ‌లేద‌ని తెలిపారు. తాను అతివాదులు, తీవ్ర‌వాదులు అనే ప‌దాల‌ను మాత్ర‌మే వాడాన‌ని చెప్పుకొచ్చారు.
హిందువుల మ‌నో భావాల‌ను కించ‌ప‌రిచే ఉద్దేశం త‌న‌కు లేద‌ని క‌మ‌ల హాస‌న్ వ్యాఖ్యానించారు. తాను కూడా హిందూ కుటుంబానికి చెందినవాడినేన‌ని అన్నారు. కాగా, తాను ఈ రోజు ప్రారంభించిన యాప్ ద్వారా ప్ర‌జ‌లు ఎక్కడైనా అన్యాయం జరిగితే తెలియజేయొచ్చని, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు గొంతెత్తాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here