అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ సినిమాకి టైటిల్ ఇదే

‘పటాస్’ .. ‘సుప్రీమ్’ .. ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో దర్శకుడు అనిల్ రావిపూడి హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు .. యువ కథానాయకులు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మాణంలోనే మరో సినిమా చేయడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడు. ఇది మల్టీ స్టారర్ కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సినిమాకి ‘ఎఫ్ 2’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారనేది తాజా సమాచారం. ఈ టైటిల్ కి ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనేది ట్యాగ్ లైన్. ఫన్ చేసే పాత్రలో ఒక హీరో కనిపిస్తే .. ఫ్రస్టేషన్ చూపించే పాత్రలో మరో హీరో కనిపిస్తాడట. అందువలన ఈ సినిమాకి ఈ టైటిల్ ను సెట్ చేశారని తెలుస్తోంది. ఈ మల్టీ స్టారర్ లో మెగా హీరోలు చేసే ఛాన్స్ ఉందనీ .. ఒక హీరోయిన్ గా మెహ్రీన్ ను తీసుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here