చిరు – రాజశేఖర్ విభేదాల గురించి రాజశేఖర్ స్పందన

ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవితో తనకు విభేదాలు రేపవద్దని మీడియాను కోరాడు. హైదరాబాదులో నిర్వహించిన ‘పి.ఎస్.వి గరుడవేగ 126.18ఎం’ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమలో మాట్లాడిన రాజశేఖర్.. చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.
చిరంజీవి తమ సినిమాను చూసి అభినందిస్తూ బొకే కూడా పంపించారని ఆయన చెప్పారు. చిరంజీవితో విభేదాలు వచ్చిన కొద్దిరోజులకే సమసిపోయాయని ఆయన వెల్లడించారు. ఆ తరువాత వివిధ కార్యక్రమాల్లో తాము కలుసుకున్నామని, వివిధ ఫంక్షన్లకు కలిసే వెళ్లామని ఆయన చెప్పారు.
 అయితే ఈ మధ్యే సినిమా విడుదల సందర్భంగా ఎవరో ఒకరు ‘‘రాజశేఖర్‌ కు ఇప్పుడే బుద్ధొచ్చింది. చిరంజీవి గారికి సారీ చెప్పిన తర్వాత సినిమా ఆడుతుంది’’ అంటూ రాశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైనా పద్దతా? అని ఆయన ప్రశ్నించారు. విభేదాలు వచ్చిన తరువాత మళ్లీ తిరిగి కలుసుకోకూడదా? కలిసి మంచిగా ఉండకూడదా? అని ఆయన నిలదీశారు. దయచేసి ఇలాంటి వార్తలతో తమను విడదీయవద్దని చెబుతూ ఆయన మీడియాను కోరారు. మీడియా రాసిన వార్తలు చదివి అభిమానులు అపార్థం చేసుకుంటారని ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here