ఏపీ సీఎం పవన్.. తమిళనాడు సీఎం కమల్??

ఇదేదో సినిమా కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. రియల్ గా జరగాలని ఓ సీనియర్ నటుడు కోరుకుంటున్నాడు. అతనెవరో కాదు. కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్ తరవాత అంతటి స్థానాన్ని పొంది.. ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తున్న సీనియర్ నరేష్.. ఈ విష్ చేస్తున్నాడు.

కమల్ హాసన్, పవన్ కల్యాణ్ కు లక్షలాది అభిమానులు ఉన్నారని.. పవన్ ఆంధ్రప్రదేశ్ కు, తమిళనాడుకు కమల్ ముఖ్యమంత్రులైతే సంతోషపడేవాళ్లు చాలా మంది ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ఇది జరిగితే.. నాటి ఎన్టీఆర్, ఎంజీఆర్ శకం.. మళ్లీ మన ముందు కదలాడడం ఖాయమని నరేష్ అభిప్రాయపడ్డాడు.

నరేష్ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో ఎవరూ తిరస్కరించకపోవడం గమనార్హం. పైగా.. నరేష్ విష్ సమంజసమైనదే అని కూడా రిప్లై ఇచ్చారు. చూస్తుంటే.. ముందు ముందు.. ఈ చర్చ మరింత పెరగడం.. ఖాయమే అని ఇటు సినీ క్రిటిక్స్ తో పాటు.. అటు రాజకీయ అనలిస్టులు కూడా అంచనా వేస్తున్నారు.

ఇది కనక నిజంగా జరిగితే.. దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనం ఖాయమని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here