వైయస్ జగన్ సిబిఐ కేసుల ఎత్తివేత?

వైసిపి అధినేత జగన్ కి మంచి రోజులు వస్తున్నట్టు ఉంది. ప్రస్తుతం జగన్ చేస్తున్నా ప్రజా సంకల్ప పాదయాత్ర పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో విశ్వాసం కలిగింది. వచ్చే ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా తమ సమస్యలను పరిష్కరిస్తారని. అయితే ఈ క్రమంలో జగన్ కి వస్తాన ఆదరణ తొలగించడానికి అధికారపార్టీ అనుకూల మీడియా జగన్ మీద బురదజల్లే కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇటీవల ఇందూ టెక్‌పై మారిషస్ కంపెనీ అంత‌ర్జాతీయ కోర్టులో కేసు వేసిన విష‌యం తెలిసిందే.
ఈ  నేపధ్యంలో ప‌చ్చ మీడియా వైఎస్ జ‌గ‌న్‌పై ఓ రేంజ్‌లో విష ప్ర‌చారం చేసింది. ఇప్పుడు ఆ ప్ర‌చార‌మే వైఎస్ జ‌గ‌న్‌కు ప్ల‌స్‌గా మారింద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇక అసలు విషయానికొస్తే వైఎస్ జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు వైఎస్ జ‌గ‌న్‌పై అక్ర‌మంగా కేసులు పెట్టిన విష‌యం తెలిసిందే. అందులో ఇందూ టెక్ కేసు కూడా ఒక‌టి. ఎప్పుడైతే మారిషస్ కోర్టు అంత‌ర్జాతీయ కోర్టుకెక్కిందో ఇందూ టెక్‌లో వైఎస్ జ‌గ‌న్ పెట్టుబ‌డులు లేవ‌ని తేలిపోయింది. దీంతో సీబీఐతోపాటు, ఈడీ, ప‌చ్చ మీడియా గొంతులో ఎల‌క్కాయ‌ప‌డ్డ‌ట్ట‌యింది.
ఆ కంపెనీ నిజంగానే జ‌గ‌న్ షేర్ కంపెనీ అయితే ఇప్పుడు కోర్టుకెందుకు ఎక్కుతుంద‌ని అంటే స‌ద‌రు కంపెనీ డ‌మ్మీ కంపెనీ కాద‌ని తేలిపోయింది. ఈ ఒ క్క పాయింట్ మీదే వైఎస్ జ‌గ‌న్‌పై ఈడీ, సీబీఐ న‌మోదు చేసిన కేసులు నిల‌వ‌వ‌ని, ఈ వార్త విన్న వైసీపీ శ్రేణులు పిచ్చ హ్యాప్పీలో ఉన్నారు. కచ్చితంగా వైయస్ జగన్ కడిగిన ఆణిముత్యంగా అక్రమంగా బనాయించినా అవినీతి కేసులను నుండి బయటకు వస్తారు అంటున్నారు వైసీపీ నాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here