తెలంగాణ రాష్ట్రానికి ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్: మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అతను అదే బాటలో పయనిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఇతర దేశాలనుండి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు తేవడంలో చాలా అద్భుతంగా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి  డిమాండ్ చేశారు.
ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి ఒక లేఖ రాశారు. ఈ కారిడార్ కి అనుకూలంగా తెలంగాణకు అన్ని రకాల అర్హతలున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.  ఈ కారిడార్ ఏర్పాటు ద్వారా తెలంగాణ స్థానిక యువతకు మరింత ఉపాది లభిస్తుందన్నారు. గత 5 దశాబ్దాలుగా అద్భుతమై ఏయిరోస్పెస్ అండ్ ఢిపెన్స్ ఈకోసిస్టమ్ తెలంగాణలో ఉన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ బడ్జెట్ లో రెండు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్లను ప్రకటించిన కేంద్రం, అన్ని విధాల అనువైన పరిస్ధితులున్నప్పటికీ తెలంగాణను విస్మరించడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నూతన రాష్ర్టానికి ఈ కారిడార్ల కేటాయిస్తే ఇక్కడి యువతకు అనేక ఉద్యోగా ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి తెలిపారు. ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడితో పాటు ఉపాధి కూడా దొరుకుతుంది అని అన్నారు మంత్రి కేటీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here