శ్రీదేవి గురించి సంచలనకరమైన నిజాలు బయటపెట్టిన రామ్ గోపాల్ వర్మ

ప్రముఖ హీరోయిన్ అందాల నటి శ్రీదేవి మరణవార్తతో యావత్ చిత్రపరిశ్రమ అలాగే ఆమె అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శ్రీ దేవి మృతి పట్ల తీవ్రంగా బాధ పడ్డారు ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి వీరాభిమాని. ఈ  క్రమంలో రామ్ గోపాల్ వర్మ  శ్రీదేవి గురించి కొన్ని సంచలన కరమైన నిజాలు బయటపెట్టారు….ఫేస్బుక్ వేదికగా. శ్రీ దేవి కుటుంబం వలన చాలా నష్టపోయింది అని అన్నారు రామ్ గోపాల్ వర్మ ….ఇక రామ్ గోపాల్ మాట్లాడుతూ శ్రీదేవిని సోదరి శ్రీలత మోసం చేసింది అన్నారు.
‘నాడు శ్రీదేవి తల్లికి అమెరికాలో బ్రెయిన్ సర్జరీ చేశారు. ఆ సర్జరీ సరిగా చేయకపోవడంతో ఆమె మెంటల్ పేషెంట్ అయిపోయారు. శ్రీదేవి సోదరి శ్రీలత తమ పక్కింటి కుర్రాడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అయితే, శ్రీదేవి తల్లి చనిపోయే ముందు ఆస్తులన్నీ శ్రీదేవి పేరు మీదనే రాశారు. ఈ వీలునామా రాసే సమయంలో తన తల్లి మానసిక వ్యాధిగ్రస్తురాలని పేర్కొంటూ శ్రీదేవిపై కేసు వేసిన శ్రీలత ఆ ఆస్తిని చేజిక్కించుకుంది. దీంతో, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవికి బోనీ తప్ప ఆమె చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది..’ అని రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి అభిమానులకు రాసిన ప్రేమలేఖలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here