సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నాని?

అప్పట్లో డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా వస్తుంది అని అన్నారు సినీ జనాలు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన సినిమా నుండి పక్కకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ స్థానంలో నాచురల్ స్టార్ నాని హీరోగా అదే కథతో సినిమా తీస్తున్నట్టు తెలిసింది. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

సంతోష్ శ్రీనివాస్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా ‘కందిరీగ’ మాత్రమే. ఆ తరువాత ఆయన చేసిన ‘రభస’ .. ‘హైపర్’ సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయినా ఆయనతో సినిమా చేయడానికి నాని అంగీకరించడానికి కారణం బ్యానర్ కి గల వాల్యూ అని అంటున్నారు. కథా కథనాలపై వాళ్లు పెట్టే ప్రత్యేక శ్రద్ధపై గల నమ్మకంతోనే నాని ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడని అంటున్నారు. ప్రస్తుతం నాని కృష్ణార్జున యుద్ధం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here