హీరోయిన్ శ్రియ పెళ్లి రష్యా కుర్రాడి తో?

ప్రముఖ సీనియర్ హీరోయిన్ దక్షిణాది చలనచిత్ర రంగంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దు గుమ్మ శ్రియ వివాహం చేసుకోబోతోంది. తెలుగు సినిమా రంగంలో చాలావరకు స్టార్ హీరోల అందరితో నటించిన శ్రియ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నది. గత కొంత కాలంగా ఆమె రష్యాకు చెందిన ఆండ్రీ కుశ్చేవ్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాలో ఇతడో వ్యాపారవేత్త, క్రీడాకారుడు కూడా. అయితే అప్పట్లో ఆండ్రీతో కలిసి షాపింగ్ చేసిన ఆమె మీడియా కంట పడ్డారు.
దానిపై మీడియా ప్రశ్నించగా తన స్నేహితురాలి వివాహం కోసమే ఇలా షాపింగ్ చేస్తున్నామని ఆమె అప్పుడన్నారు.అయితే చివరికి ఇప్పుడు శ్రియ పెళ్లి వార్త అఫీషియల్ అయింది. పెళ్లిని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మార్చి 17, 18, 19తేదీల్లో మూడురోజుల పాటు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. 18వ తేదీన వధూవరులిద్దరూ హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఈ మూడు రోజుల వివాహం అనంతరం మాస్కోలో మరో రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. మొత్తంమీద హీరోయిన్ శ్రియ రష్యా కోడలు అయింది అంటున్నారు సినిమా జనాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here