ఆగిపోతున్నా జగన్ పాదయాత్ర!

ఆంధ్రప్రదేశ్ టెట్ పక్షనేత వైసిపి అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఫిబ్రవరి 28వ తారీకున 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా వైసిపి కార్యకర్తలు నాయకులు జగన్ చేసిన 100 వ రోజు పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జగన్ వంద రోజులకు 1350 కి.మీ నడిచారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలో జగన్ పాదయాత్ర రెండు రోజులు వాయిదా పడినట్లు చెబుతున్నారు వైసీపీ పార్టీ నాయకులు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని జగన్ ముందు నుంచే చెప్పుకుని వస్తున్నారు. అయితే తాజాగా ఇటీవల జగన్ ప్రత్యేక హోదా అంశంపై గట్టి వ్యాఖ్యలే చేశారు….ఈ నేపథ్యంలో ఇటీవల పాదయాత్రలో ప్ర‌త్యేక‌మోదా విష‌యంలో మాత్ర త‌గ్గ‌మ‌ని జ‌గ‌న్ స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ఏపీ ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ తన పోరాటాన్ని ఉధృతం చేసింది.
మార్చి 1న అని జిల్లాల‌ కలెక్టరేట్లను ముట్ట‌డించ‌నున్నారు. అంతేకాకుండా మార్చి 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా చేపట్టనుంది. కలెక్టరేట్ల ముట్టడి పిలుపు నేపథ్యంలో జగన్‌ గురువారం పాద‌యాత్ర‌కు విరామం ఇవ్వనున్నారు. ఇక ఈ క‌ల‌క్టరేట్ల‌ ముట్ట‌డికి ప్రజలతో కలిసి వైసీపీ శ్రేణులు కూడా పాల్గొన‌నున్నారు. దీంతో జగన్ పాదయాత్ర వాయిదా పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here