రామోజీ ఫిలింసిటీలో ప్రభాస్ సినిమా భారి సెట్

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో భారత దేశంలోనే అతిపెద్ద విజయం సొంతం చేసుకున్న హీరో ప్రభాస్…. తన తర్వాత సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విదేశాల నుండి ఫైట్ మాస్టర్స్ ని తెప్పించి ప్రతి సన్నివేశంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు ప్రభాస్. ఈ సందర్భంగా దుబాయ్ లో యాక్షన్ సనివేశాలకు విదేశీ ఫైట్ మాస్టర్ల ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ ను అక్కడ ప్లాన్ చేశారు.
అక్కడ అనుమతులు లభిస్తాయనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు. అంతా రెడీ చేసుకున్నాక .. అక్కడి నుంచి అనుమతులు రావడం కష్టమేననే విషయం అర్థమైందట. ఎంతగా ప్రయత్నించినా అక్కడి నుంచి అనుమతులు రాకపోవడంతో, రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో సెట్ వేసి షూటింగ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. అయితే ఈ క్రమంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here