నాగార్జున మల్టీస్టారర్ సినిమాలో అనుష్క

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున నాని కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య…ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ మిద తెరకెక్కిస్తున్నారు.కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో హీరో నాగార్జున డాన్ గా దర్శనమిస్తుండగా హీరో నాని డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో నానికి జోడీగా చేయడానికిగాను రీసెంట్ గా శ్రద్ధా శ్రీనాథ్ ను ఎంపిక చేశారు.
దాంతో నాగార్జున సరసన కథానాయికగా ఎవరు కనిపించనున్నారనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఆయన సరసన నాయికగా అనుష్కను తీసుకోనున్నారనేది తాజా సమాచారం. నాగార్జున ‘సూపర్’ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమైన అనుష్క ఈ సినిమాలో నాగార్జున పక్కన నటిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ జోడి అయినా వీరిద్దరూ మళ్ళి నటించడం విశేషం. గతంలో వీరిద్దరి కలిసి చాలా సినిమాల్లో నటించడం జరిగింది.ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో మొదలుకానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here