స్పీడ్ మిద ఉన్న అల్లరి నరేష్

ప్రముఖ హాస్యనటుడు అల్లరి నరేష్ సినిమాలు చేయడంలో ఇతనికి మించిన స్పీడ్ హీరో ఎవ్వరు లేరు ఒకప్పుడు..సంవత్సరానికి కనీసం రెండు మూడు సినిమాలు గ్యారెంటిగా  దింపేవాడు..గనుక ఆ టైములో అల్లరి నరేష్ ని మినిమం గ్యారెంటీ హీరో అనేవారు. అయితే ఈ నేపథ్యం లో గత కొంతకాలం గా అల్లరి నరేష్ కి సరైన హిట్ లేదు.ఈ విషయంపై ఆయనతో పాటు అభిమానులు కూడా అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో తనకి ‘సుడిగాడు’తో సూపర్ హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాసరావుతో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇది కాకుండా దర్శకుడు పి.వి.గిరికి కూడా ఆయన ఓకే చెప్పేశాడు. గతంలో ఈ దర్శకుడు ‘నందిని నర్సింగ్ హోమ్’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆయన వినిపించిన కథ కొత్తగా అనిపించడంతో అల్లరి నరేశ్ ఆసక్తిని చూపించాడని అంటున్నారు. ఎలాగైనా ఈసారి హిట్టు కొట్టాలని ఉన్నాడు అల్లరినరేష్. ఈ నేపథ్యంలో గతంలో హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాస ని నమ్ముకొన్నాడు ఆయన దర్శకత్వంలో  సుడిగాలి 2 చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here