మొదటి రోజు హైదరాబాద్ లో ఇవాంకా రోజు ఇలా గడిచింది ..

ఫైనల్ గా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ప్రత్యేక స‌ల‌హాదారు అయిన ఇవాంకా ట్రంప్ తెలుగు గడ్డపై అడుగు పెట్టారు. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ సందర్బంగా హైదరాబాద్ కు వచ్చిన ఆమెకు తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. మంగళవారం ఉదయం తెల్ల‌వారుజామున 3.30గంటలకు ఆమె స్పెషల్ విమానం శంషాబాద్ లోని రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికా నుంచి 60 మంది భద్రతా సిబ్బంది కూడా వచ్చారు.

మొదట ఇవాంకాకు తెలంగాణ మంత్రులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.అనంతరం ఆమె ప్రత్యేక వాహానంలో ప్రముఖ ట్రైడెంట్ హోట‌ల్‌కు చేరుకున్నారు. ఎక్కడా ఆమె ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇవాంకా మధ్యాహ్నం 3 గంటలకు హెచ్ఐసీసీలో జరిగే సదస్సుకి వెళ్ళారు . కార్యక్రమం అనంతరం 4 గంటల 25 నిమిషాల సమయంలో భారత ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు .

నరేంద్ర మోడీ ముందుగా మియాపూర్ లో మెట్రో రైలును ప్రారంభించి ఆ తర్వాత హెచ్ఐసీసీ వేదిక వ‌ద్ద‌కు చేరుకుంటారు. అక్కడ ఇవాంకా ట్రంప్ ని వారు కలుసుకున్నారు . నరేంద్ర మోడీ ఫలక్ నుమా ప్యాలెస్ లో ఇచ్చే విందు కార్యక్రమంలో ఇవాంకా పాల్గొన్నారు. ఆమె మొదటి రోజు హైదరాబాద్ లో ఈ విధంగా గడిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here