88కి.మి పాద‌యాత్ర‌లో ఎమ్మెల్యే రోజా…ఇర‌కాటంలో ఏపీ ప్ర‌భుత్వం

ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టేందుకు  వైసీపీ ఎమ్మెల్యే రోజా విశ్వ‌ప్ర‌యాత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా కొద్దిరోజుల క్రితం కృష్ణాన‌ది బోటు పడ‌వ ప్ర‌మాదానికి కారణం చంద్ర‌బాబేన‌ని ఫైర్ అయ్యారు.  చంద్ర‌బాబుకు దేవుడి పై అస్స‌లు ఏమాత్రం భ‌క్తి లేద‌ని.. ఆయ‌న ఎక్క‌డ పూజ‌లు చేసినా.. కాళ్ళ‌కు బూట్లు వేసుకునే పూజ‌లు చేస్తార‌ని అందుకే ఇలాంటి ఘోరాలు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు.
గ‌తంలో గోదావరి పుష్కరాల్లో బూట్లు వేసుకుని పూజలు చేసి మొత్తం 29 మంది ప్రాణాలను బ‌లితీసుకున్నార‌ని.. ఇప్పు తాజాగా కృష్ణా పవిత్ర సంగమంలో కూడా బూట్లు వేసుకుని పూజలు చేసి 22 మంది ప్రాణాలను గాలిలో కలిపారని విమర్శించారు.  ఈ వ్యాఖ్య‌ల‌పై కంగుతిన్న టీడీపీ నేత‌లు రోజా వ్యాఖ్య‌ల్ని ఖండించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు స‌రికాదా మిన్నుకుండిపోయారు. ఏం మాట్లాడితే ఎన్ని ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుందేమోన‌ని మౌనం వ‌హించారు.
ఇప్పుడు ప్ర‌జా స‌మ‌స్య‌లే ల‌క్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ పాద‌యాత్ర‌లో ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతుఉన్నారు.  వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. జ‌గ‌న్ కి మ‌ద్ద‌తుగా ప్ర‌భుత్వ ప‌నితీరును ప్ర‌శ్నిస్తూ  రోజా పాద‌యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. గాలేరు – న‌గ‌రి ప్రాజెక్ట్ పై ప్ర‌భుత్వ ప‌నితీరును ఎండ‌గ‌డుతు ఈనెల 28 నుంచి నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కిలోమీటర్లు రోజా పాదయాత్ర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here