సీరియస్ క్లాస్ తీసుకున్న చంద్రబాబు .. ఎమ్మెల్యే లు బేజారు !

పనితీరు విషయం లో ఎమ్మెల్యేల మీద సీరియస్ అవుతూ పద్ధతి మార్చుకోవాలి అని చంద్రబాబు క్లాస్లు పీకడం చాలా సాధారణమైన వార్త అని మనదరికీ తెలుసు. ఎప్పటికప్పుడు చంద్రబాబు వారికి క్లాస్ పీకారు, పనితీరు మర్చుకోమన్నారు అంటూ వార్తలు రోటీ గా చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా మాత్రం కాస్త స్పెషల్ క్లాస్ తీసుకున్నారట బాబుగారు . రీసెంట్ గా జరుగుతున్న శాసనసభ సమావేశాల కి వైకాపా పార్టీ పూర్తిగా బహిష్కరణ చేసింది. సో సమావేశాలు చాలా తెలివిగా నిర్వహించాలి అనేది చంద్రబాబు ఆలోచన.

ఇదే ఎమ్మెల్యేల తో కూడా ఆయన ఎప్పుడూ చెబుతూ వచ్చారు. ఈ మ‌ధ్య వ‌రుస‌గా ఓ నాలుగు రోజులు అసెంబ్లీకి సెల‌వులు వ‌చ్చాయి. పెళ్లిళ్లు, శుభ‌కార్యాలు ఉన్న నేప‌థ్యంలో స‌మావేశాల‌కు బ్రేక్ ప‌డింది. అయితే, సోమవారం స‌భ స‌మావేశం కాగానే… టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య కాస్త త‌క్కువ‌గా క‌నిపించింది. దీంతో ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హించారు. స‌మావేశం విరామ స‌మ‌యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, విప్ ల‌ను పిలిచించి ఓ స‌మావేశం ఏర్పాటు చేసి.. క్లాస్ తీసుకున్నారు.

నాలుగు రోజులు వచ్చిన శలవులు సరిపోవడం లేదా అందరూ సమావేశాలకి రావాలి అని చెప్పినా కూడా తన మాట ఎందుకు కేర్ చెయ్యడం లేదు అంటూ బాబుగారు చాల సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు, స‌మావేశాల జ‌రుగుతున్న స‌మ‌యంలో ఏయే నేత‌లు స‌భ‌కు ఎన్నిగంట‌ల‌కు వ‌స్తున్నారూ, మ‌ధ్య‌లో ఎన్నిసార్లు బ‌య‌ట‌కి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు.. ఇలాంటి వివ‌రాలపై కూడా ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. సిబ్బందిని అడిగి మరీ హాజరు వివరాలు తెప్పించుకున్నారు.

ప్ర‌తిప‌క్షం స‌భ‌లో లేద‌నీ, కాబ‌ట్టి స‌మావేశాలు జ‌రుగుతున్న అన్ని రోజులూ ఎమ్మెల్యేలు త‌ప్పకుండా హాజ‌రు కావాల‌ని చంద్ర‌బాబు అన్నార‌ట‌. ప్ర‌తిప‌క్ష పార్టీ పాద‌యాత్ర అంటూ ప్ర‌జ‌ల్లో ఉంద‌నీ, స‌భ‌లో మ‌న తీరు ఏమాత్రం స‌రిగా లేక‌పోయినా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని సీఎం క్లాస్ తీసుకున్న‌ట్టు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here