ఇంట్లోని గడపకున్న విశిష్టత

మనఇళ్లలోని గడపలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా గడపను హిందువు అమితంగా పూజిస్తారు. తద్వారా అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతుంటారు. మహిళలు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తారు. గడపలో లక్ష్మీదేవీ, తులసీ దేవి కొలువై ఉంటారట. వీరు భక్తులకు ధనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తారని పండితులు చెబుతున్నారు. అందుకే మహిళలు గడపలను

అలాపూజిస్తారు. అంతేగాని గడప పై నిలబడటం, కూర్చోవడం, కాళ్లు తగిలించడం లాంటివి చేస్తే ఆ ఇంట్లో వారికి ధనం నిలవకుండా, అనారోగ్యం సమస్యల్ని కొనితెచ్చుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇంకా గడపకు అవతల ఒకరు, ఇవతలల ఒకరు నిలబడి ఏదీ తీసుకోవడం, ఇవ్వడం చేయకూడదు. దాని వల్ల ఇద్దరికి నష్టం జరిగి , అన్నీ సమస్యలు వస్తాయంట. గడపపై తలకూడా పెట్టి నిద్రించడకూడదట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here