`ప‌ద్మావ‌త్‌` వివాదంపై ప్ర‌థ‌మ పౌరుని కామెంట్‌?

బాలీవుడ్ సినిమా పద్మావతి ఇటీవల విడుదలకు ముందు అనేక ఆందోళనలకు ఘర్షణలకు గురవడం మనం చూశాం. ఈ సందర్భంలో స్కూల్ పిల్లల బస్సులను తగలపెట్టడం,అల్లర్లు,మరియు అనేకమైన దాడులు చేశారు కొందరు.త‌గుల‌బెట్టారు. ఇదంతా కులం కోసం, మ‌తం కోసం కొట్లాట‌గానే భావించాల్సి ఉంటుంది.ఇలాంటివి మ‌ళ్లీ మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా ఉండాలని దేశ సార్వభౌమాధికారాన్ని ఐక్యతను కాపాడుకునే దిశగా  రాష్ట్రపతి ప్రసంగించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించడం జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ తన ప్రసంగంలో ఓ ర‌కంగా ప‌ద్మావ‌త్ వివాదంపై, క‌ర్ణిసేన‌ల‌పై త‌న‌దైన పంచ్ వేశార‌నే చెప్పాలి. “ విలువలతో కూడిన అభివృద్ధి భార‌త‌దేశానికి అవ‌స‌రం. పొరుగువారి అభిప్రాయాలకూ, హక్కులకూ, వ్యక్తిగత గోప్యతకూ విలువివ్వండి. పండుగలు చేసుకున్నా, నిరసనలు చేపట్టినా ఇతరులకు అసౌకర్యం కల్గించొద్దు“ అంటూ త‌న‌దైన శైలిలో రాష్ట్ర‌ప‌తి కోరారు.
రాష్ట్రపతి వ్యాఖ్యలు చూస్తుంటే పరోక్షంగా పద్మావతి వివాదం పైన ఘర్షణలకు కారకులైన అసాంఘిక శక్తుల మీద విరుచుకుపడ్డారని చెప్పాలి.కులం పేరు మతం పేరు చెప్పిసమాజంలో గొడవలు సృష్టించే వారిని బాగా బుద్ధి చెప్పారు రాష్ట్రపతి తన 69వ గణతంత్ర దినోత్సవం ప్రసంగం లో. ఈ నేపధ్యం లో  కుల‌మ‌తాల పిచ్చితో కొట్టుకుంటున్న మ‌న రాజ‌కీయ‌ నేత‌ల‌కు, కుల‌మ‌తాల‌తో రాసుకుపూసుకు తిరిగే నేత‌ల‌కు ఇందులోని ప‌ర‌మార్థం అర్థ‌మ‌వుతుందంటారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here