ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణ.. రానిదెవరో

నాగశౌర్య హీరోగా రూపుదిద్దుకున్న చలో ఆడియో వేడుకకు మెగస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన వార్త చెప్పారు.నేను ఈ పంక్షన్ కి రావడానికి గల ముఖ్య కారణం యంగ్  టాలెంట్ ప్రోత్సహించడానికే వచ్చానని  చిరంజీవి తెలిపారు.ప్రస్తుతం ఉన్న కుర్రహీరోల ను ఎంకరేజ్ చేయడం నాకిష్టమని చిరంజీవి అన్నారు. తన కెరీర్ ప్రారంభం లో ఓ శతదినోత్సవానికి స్టార్ హీరోని పిలిస్తే ఆయన రాలేదని అన్నారు.

ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తికరమైన విషయం. అప్పట్లో చిరంజీవి తొలి శతదినోత్సవ సినిమా అంటే 1980 వచ్చిన ఇది కథ కాదు సినిమా.1980 సంవత్సరములో స్టార్ హీరో అంటే ఎన్టీఆర్.. ఏఎన్నాఆర్ లతో పాటు కృష్ణ.. శోభన్ బాబు వంటి హీరోలను చెప్పుకోవచ్చు.వీరిలో ఎవరు ఉండొచ్చని అనుకుంటే. మరోవైపు బిజీగా ఉండటంతో ఆ స్టార్ హీరో రాలేదు అని చిరంజీవి ఫంక్షన్ లో తెలపడం జరిగింది.

ఆ సమయంలో అంత బిజీగా ఉన్న హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే, కనీసం సంవత్సరానికి పది నుంచి పన్నెండు సినిమాలు తీసేవారు. అయినా సరే బిజీ సమయంలో అడగడంతోనే.. కృష్ణ రాలేకపోయి ఉంటారని చిరంజీవి అంటున్నారు.ఈ సందర్భంలో చిరంజీవి కృష్ణా పేరు నేరుగా చెప్పలేదు.ఈ పజిల్ ని వారు చెప్పరు.. చిరు విప్పరు. సో.. ఆ సస్పెన్స్ అలా కంటిన్యూ అవాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here