వర్మకి షాక్ ! జీఎస్టీ కథ తనదే అంటున్న రచయిత!

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న జీఎస్టీ కాన్సెప్ట్ స్టొరీ మీద పి.జయ కుమార్ అనే రచయిత కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు ఈ పిటిషన్ స్వీకరించి మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపించడం జరిగింది.ఈ సందర్భంగా రచయిత జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ  గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) కాన్సెప్ట్ను 2015 ఏప్రిల్ 1న  వర్మకు పంపెనని రామ్ గోపాల్ వర్మ నుండి ఎటువంటి స్పందన రాలేదని అయితే ఉన్నట్టుండి నేను రాసుకున్న స్క్రిప్టును దొంగిలించి ఉన్నది ఉన్నట్టుగా కొంచెం కూడ మార్పులు చేయకుండా సినిమా తెరకెక్కిస్తున్నారు అని తెలుసుకుని షాక్ కు గురయ్యానని, నా స్క్రిప్ట్ ని దొంగిలించి ఆయన ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారని, తనకు తగిన న్యాయం జరిగేలా చూడమని కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.అయితే ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ  స్పందించారు.

జయకుమార్ నా ఆఫీసులో పని చేశాడని అతను ఒక దొంగ అని అతనిని పది నెలల క్రితం నుండి ఉద్యోగం నుండి తీసేసాను అని వర్మ చెప్పాడు.తన పై ఇంత పెద్ద నింద వేసిన జయకుమార్ పై ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు..ఈ సినిమా ఇంటర్నెట్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ కోర్ట్ నోటీసుల నేపథ్యంలో అసలు చిత్రం అసలు విడులవుతుందా లేదా అనే టెన్షన్ ప్రేక్షకుల్లో మొదలయినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here