మహేష్… ఏపీ ముఖ్యమంత్రి!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో గతంలో శ్రీమంతుడు సినిమా బాక్సాఫీసు దగ్గర కు వచ్చి అప్పట్లో ఉన్న రికార్డులను తుడిచి పెట్టుకుపోయింది. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు ఉదయం విడుదల చేసిన ‘ఫస్ట్ ఓథ్‌’ అని సినిమాకి సంబంధించి మహేష్ బాబు వాయిస్ ఇస్తున్న  ఒక పోస్టర్ తో కూడిన వీడియోను విడుదల చేయడం జరిగింది.
విడుదలైన ‘ఫస్ట్ ఓథ్‌’ బట్టి సినిమాలో ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటిస్తున్నాడు, ఆయన పేరు భరత్ అని క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి కొరటాల శివ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. స్టోరీ గురించి క్లారిటీ ఇచ్చారు.. “డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో మహేష్‌బాబుగారు హీరోగా నేను దర్శకత్వం వహిస్తున్న సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని చాలామందికి తెలుసు.
ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే… ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఒక కల్పిత రాజకీయ కథ” అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ. కానీ సినిమాకి సంబంధించి ఎటువంటి టైటిల్ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. మరో మంచి చూసుకుని టైటిల్ అనౌన్స్ చేస్తారేమో!  బయట ప్రేక్షకులలో  మాత్రం “భరత్ అనే నేను టైటిల్” వినికిడిలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here