అక్టోబర్ లో పట్టాలెక్కనున్న చరణ్,యన్ టి ఆర్ ల మల్టీస్టారర్ ?

సౌతిండియా సినీ ఇండస్ట్రీలోనే అతి పెద్ద భారీ మల్టీస్టారర్ సినిమాకి దర్శక దిగ్గజం రాజమౌళి శ్రీకారం చుట్టాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి సినిమా తీస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటివరకు అధికారంగా ప్రకటన చేయకపోయినా ఈ మధ్య ఆయన సోషల్ మీడియా వేదికగా చరణ్, యన్ టి ఆర్ లతో కలిసి వున్న ఫోటో ఒకటి విడుదల చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి రాజమౌళి తీయబోయే సినిమా ఎన్టీఆర్ రామ్ చరణ్ తో అని ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం షూటింగ్ ముగించుకోవడం జరిగింది. దీంతో తర్వాత బోయపాటి డైరెక్షన్లో ఏక షెడ్యూల్ తో సినిమా పూర్తి అవడానికి రామ్ చరణ్ ప్రణాళికలు వేస్తున్నాడు. తరువాత అక్టోబర్ నుండి రాజమౌళి చిత్రానికి తన కాల్షీట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.ఎన్టీఆర్ కూడా దర్శకుడు త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా మార్చిలో షూటింగ్ మొదలవుతుంది.  అందువల్ల యన్ టి ఆర్ ఈ చిత్రం పూర్తి చేసి రాజమౌళి చిత్రానికి కాల్షీట్స్ ఇవ్వడానికి టైం పడుతుందని,ఈలోపు రాజమౌళి ముందుగా చరణ్ తో చిత్రాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ షూటింగులో జాయిన్ అవుతారని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాంచరణ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ సినిమా స్టోరీ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు అని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here