చాంపియన్స్ ట్రోఫీలో.. భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా.?

చాంపియన్స్ ట్రోఫీలో.. భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా.? కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే ఆరోపణల్లో నిజమెంత.? ఆయన చెప్పినట్లు.. క్రీడల్లోనూ రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరముందా.? క్రీడల్లోనూ రిజర్వేషన్ అమలు చేయాలంటూ కేంద్ర మంత్రి  రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర నాగపూర్ లో ఓ కార్యక్రమానికి వచ్చిన రామదాస్.. అంతర్జాతీయ క్రీడల్లో ఎస్సీ,ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు.
ఈ విషయంలో బీసీసీఐ అందరికి సమానమైన అవకాశాలు కల్పించాలన్నారు. ఈ విషయమై క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ తో కూడా తాను మాట్లాడతానని అన్నారు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ చేతిలో మన టీం ఓడిపోవడం దారుమమన్నారు రామ్ దాస్. ఈ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం తనను విస్మయానికి గురి చేసిందన్నారు. తనతో పాటు ప్రతి అభిమానికీ ఫిక్సింగ్ పైన అనుమానాలున్నాయని చెప్పారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపించాలన్నారు.
గతంలో ఎన్నో సెంచరీలు చేసిన యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ… పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడానికే ఆడినట్లుగా ఉందన్నారు. అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే అనుమానం కలుగుతోందన్నారు.
క్రీడల్లో రిజర్వేషన్ కల్పించడం మూర్ఖత్వమేనంటున్నారు క్రికెట్ నిపుణులు. క్రీడల్లో.. గెలుపోటములు సహజమని.. అంతమాత్రానికే.. మ్యాచ్ ఫిక్సింగ్ అనటం కరెక్ట్ కాదంటున్నారు. స్పోర్ట్స్‌లో.. టాలెంట్ ఉన్న వాళ్లకు మాత్రమే అవకాశం కల్పించాలంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here