ఖమ్మం జిల్లా రఘునాధ పాలెంలో దారుణం జరిగింది. వావి వరుసలు మరచిన మామా కోడళ్లు అక్రమసంబంధం పెట్టుకున్నారు. అంతేకాదు సొంత తండ్రి తన కొడుకునే మోసం చేసి కోడలితో కలిసి చెన్నై పారిపోయారు. నెల రోజులుగా కనిపించకుండా పోయిన వీళ్ల కోసం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు అప్పటి నుంచి మామా కోడళ్లు చెన్నైలోనే గడిపారు. నిన్న చెన్నై నుంచి వచ్చిన ఈ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. చెన్నై నుంచి వచ్చాక తమ విషయం ఇంట్లో తెలిసిపోయిందని మనస్థాపం చెంది ఆత్మహత్యా యత్నంచేశారు.
రోడ్డుపై అపస్మారక స్థితిలోఉన్న ఈ జంటలు ఎవరో ప్రేమ జంట అనుకొని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈఘటనలో యువతి చేయి కోసుకోవడంతో తీవ్రంగా రక్తస్రావమై సృహకోల్పోయింది. ఆసుపత్రికి తరలించిన పోలీసులు వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు రావడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వీళ్ల కోసం చాలా చోట్ల వెతికామని అమ్మాయి బంధువులు చెబుతున్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని వెతకడం ప్రారంభించడంతో కేసు అవుతందనే భయంతో తిరిగి ఖమ్మం వచ్చారు. ఇంట్లో వాళ్లకు ఏం చెప్పాలో తెలియని అయోమయంలో ఇలా ఆత్మహత్యయత్నం చేసినట్టు తెలుస్తోంది.
