హైదరాబాద్ మగువల్ని ఊపేస్తున్న బిలేడీ డ్యాన్స్

అందంతోపాటు ఫిట్‌గా ఉండేందుకు మగువలు ఇంట్రస్ట్‌ చూపిస్తారు. అందుకోసం పడరాని పాట్లు పడుతూ వర్కవుట్స్‌ చేస్తుంటారు. కొంచెం లావెక్కినా తట్టుకోలేరు. అందుకే మగువల కోసం ఎప్పటికప్పుడు కొత్త తరహా డ్యాన్స్‌ వర్కవుట్స్‌ మార్కెట్లోకి వస్తుంటాయి. అదే తరహాలో ఇప్పుడు మరో కొత్త డ్యాన్స్‌ సీక్వెన్స్‌ అమ్మాయిల్ని ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్‌లో కొత్త రకం డ్యాన్స్‌ ఇప్పుడు యూత్‌ను తెగ అట్రాక్ట్‌ చేస్తోంది. రొటీన్‌‌కి భిన్నంగా ఉన్న బిలేడీ డ్యాన్స్‌…. అమ్మాయిల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఫిట్‌నెస్‌ కోసం అమ్మాయిలంతా ఇఫ్పుడు బిలేడీ డ్యాన్సులనే ట్రై చేస్తున్నారు. బిలేడీ కాన్సెప్ట్‌ కొత్తగా ఉండటంతో …. డిఫరెంట్‌ స్టెప్స్‌తో దుమ్మురేపుతున్నారు మగువలు. బెల్లీ మిక్సయ్యే ఈ బిలేడీ డ్యాన్స్‌లో క్లాసిక్‌, ఫోక్ స్టైల్లో కొత్త కొత్త స్టెప్పులు ఉంటాయి.
వార్మప్‌‌తోపాటు యోగాసాలను కూడా బిలేడీ డ్యాన్స్‌లో మిక్స్‌ చేస్తున్నారు. ఫ్యాట్్ను తగ్గించుకోవడంతోపాటు… ఫిట్్నెస్‌కి ఇది చాలా యూజ్‌ అవుతుందంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌.  టాలీవుడ్‌ సాంగ్స్‌కి కాస్త పోక్‌ను కలిపి కొత్తగా ట్రై చేస్తున్న ఈ బిలేడీ డ్యాన్సులతో కొవ్వు కరగడమే కాకుండా… కార్డియో, మజిల్స్‌, బ్లెడ్‌ ప్రెజర్‌ కంట్రోలై…బాడీ యాక్టివ్‌గా మారుతోందంటున్నారు మగువలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here