జంధ్యం వేసుకుంటే ముగ్గురు దేవతల అనుగ్రహం పొందొచ్చు

జంధ్యాన్ని హిందూ సాంప్రదాయంలో బ్రాహ్మణులుధరిస్తారు. కానీ సాంప్రదాయం ప్రకారం ఎవరైనాధరించవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అలాధరించడం వల్ల ముగ్గురు దేవత అనుగ్రహం పొందవచ్చట. జంధ్యంలో మూడు దారాలుంటాయి. ఆ మూడు దారాల్లో ఒక‌రు శ‌క్తినిచ్చే పార్వ‌తి,మ‌రొక‌రు ధ‌నాన్నిచ్చే ల‌క్ష్మి, ఇంకొక‌రు చ‌దువునిచ్చే స‌ర‌స్వ‌తి. ఈ క్ర‌మంలో జంధ్యం ధ‌రించ‌డం వ‌ల్ల ఆ ముగ్గురు దేవ‌తల అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చ‌ట‌. దీంతో జీవితం ఎంతో సుఖ‌మ‌యంగా ఉంటుంద‌ట‌. ఇలాజంధ్యాన్ని జందెం, జందియం, య‌జ్ఞోప‌వీతం అని కూడా పిలుస్తారు

జంధ్యాన్ని ఎప్పుడు ధరించాలి. మార్చడానికి ఎలాంటి నియమాలు పాటించాలి.

ఎప్పుడైనా మైల వచ్చి, ఆ మైల శుద్ధి అయిన తరువాత తల్లి కానీ, తండ్రి గాని ఎవరైనా స్వర్గస్తులైన లేదా కొన్ని కొన్ని పర్వదినాలల్లో శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అంటాము ఆ రోజున, విదేశీ పర్యటన పూర్తిచేసుకొని స్వదేశానికి తిరగివచ్చినప్పడు అప్పడు య‌జ్ఞోప‌వీతం మార్చుకోవాలి. ఇవి కాకుండా జంధ్యం మార్చే ఘట్టాలు ఉన్నాయి. శిధిలమై పోతే జంధ్యం బాగా పాడై పోయింది. అలాంటి జంధ్యాన్ని పొరపాటు ధరించకూడదు. తక్షణమే తీసేయాలని ఉంది.

ఎలా మార్చాలి. మార్చేటప్పుడు ఆచమనం చేసుకొని , సంకల్పం చెప్పుకొని జీర్ణోపవేతాన్ని విసర్జిస్తున్నా కొత్త యజ్ణోపేతాన్ని ధరిస్తున్నాను అంటూ రెండు మంత్రాలుంటాయి. అవి చదువుకుంటూ వేసుకుంటే మంచిది. పురోహితుడు లేకపోతే ఆచమన సంకల్పాలు అయిపోయాక నూత యజ్ణోపే దారణ మహంకరిష్యే అని అప్పుడు కొత్త య‌జ్ఞోప‌వతాన్నిధరించాలి. జంధ్యాన్ని పై నుంచి వేసుకోవాలి. తీసేసేటప్పుడు కిందనుంచి తీసేయాలి. ఇదియ‌జ్ఞోప‌వేత దారణకు నియమాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here