ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఈమె వయసు

అందం అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. వయసు పెరిగే కొద్ది తగ్గిపోతుంది. ఇది ప్రకృతి సహజం. కానీ ప్రకృతి విరుద్దంగా జరిగిన ఈ అమ్మడు వ్యవహారం ప్రపంచదేశాలకు షాకిచ్చింది. ఇంతకి అదెలా అంటారా.
అందానికే అసూయ పుట్టించే అందం ఆమె సొంతం. ఒక్కసారి చూస్తే చూపు మరల్చుకోలేరు. అలాంటి అందం చూడడానికి స్వీట్ 16 లా ఉన్నా ఆమె వయసు ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సింది. షాక్ మీకే  కాదు ప్రపంచదేశాలు ఆమె వయసు ఎంతో తెలుసుకొని కంగుతింటున్నాయి. ఆమె మాత్రం తన అందాన్ని రోజురోజుకు మరింత రెట్టింపుచేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. తైవాన్ కు చెందిన లూరేసు ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. ఈమె అక్క చైనీస్ కు చెందిన యాక్టర్. అయితే ఆమె అక్క నటించిన ఓ సినిమా ఫంక్షన్ కు హాజరైంది.
అయితే ఆ ఫంక్షన్ లో  అక్క కంటే ముందుగా చెల్లెలు లూసీ పై మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆమె అందానికి ఫిదా అయిన కొంతమంది మీడియా ప్రతినిధులు ఆమె గురించి ఆరాతీయగా అసలు విషయం తెలుసుకొని కంగుతిన్నారు. అక్కకంటే చెల్లెల్లు బాగుందని ఓ మీడియా ప్రతినిది..మీరు చాలా అందంగా ఉన్నారు. మీ వయసెంతో చెప్పగలరా అంటూ ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన లూరేసు తన ఏజ్ (42) అని చెప్పుకొచ్చింది. మీరు స్వీట్ 16లా ఉన్నా మీ వయసు 42 అంటే నమ్ముబుద్ధి కావడంలేదు. మీ అందం రహస్యం ఏంటని అడిగితే పచ్చి కూరగాయలు తినడం, బాగా నీళ్లు తాగడమే నా అందానికి రహస్యమని చెప్పింది. ఈమె వయసు గురించి ఆరాతీసిన కొన్ని మ్యాగజైన్ కంపెనీలు ఫోటో షూట్ కోసం క్యూకట్టాయి. అలా దిగిన లూరేసు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here