వీధుల్ని కంపుకంపు చేసి… గోడపై పాటపాడేసిన కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్

మూత్ర విసర్జనకు ఇబ్బందిగా ఉందని పెళ్లి కూతురు..పెళ్లి కొడుకుల్ని వదిలేసిన సంఘటనల్ని చూశాం. అదే పెళ్లి కొడుకు ఇంట్లో బాంత్రూం లేదంటే సంసారం చేయడానికి ఒప్పుకోని యువతుల్ని చూశాం. అదే బాత్రూం ఇన్సిడెంట్ ను సినిమాగా తీస్తున్న టాయిలెట్ సినిమాను చూస్తున్నాం. ఇంతటి ఘనమైన దేశంలో బీజేపీకి చెందిన కేంద్రమంత్రి ఇష్టం వచ్చినట్లు బహిరంగంగా పాటపాడాడు. పాటపాడటానికి చుట్టూ  హైసెక్యూరిటీ. ఈ కేంద్రమంత్రి చేసిన నిర్వాహకాన్ని కొంతమంది స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.

దేశాన్ని పరిశుభ్రం చేసే పనిలో పీఎం మోడీ స్వచ్ఛ్ భారత్ తో బిజీగా ఉంటే ..కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ బహిరంగంగా ఓగోడ దగ్గర మూత్ర విసర్జన చేశాడు. అందరు పరిశుభ్రంగా ఉండాలి మోడీ చీపురు పట్టి వీధులు చిమ్ముతుంటే ఈయనగారు మాత్రం అదే వీధుల్ని కంపుకంపు చేసి పారేస్తున్నారు. బ‌హిరంగ మ‌లమూత్ర విస‌ర్జ‌న చేయ‌కూడ‌ద‌ని.. మరుగుదొడ్లు లేని వాళ్ల‌కు ప్ర‌భుత్వం డ‌బ్బులు చెల్లించి మ‌రీ వాటిని క‌ట్టిస్తోంది. వాటిని పట్టించుకోకుండా ఇలా బహిరంగంగా పాటపాడటం పై నెటిజన్లు విమర్శిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here