డీజే పైర‌సీపై సైబ‌ర్ పోలీసుల‌కు పిర్యాదు చేసిన దిల్‌రాజు

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. ఈ సినిమా విడుద‌లైన బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొడుతూ విజ‌య ప‌థంలోకి దూసుకెళుతుంది. ఇలాంటి త‌రుణంలో పైర‌సీదారుల చ‌ర్య‌లు సినిమాకు పెద్ద ఆటంకంగా మారింది. కొంద‌రు దుండ‌గులు అప్పుడే సినిమాను సోష‌ల్ మీడియాలో లీక్ చేసేశారు. ఇటువంటి దుశ్చ‌ర్య‌లు క‌లెక్ష‌న్స్‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని భావించిన నిర్మాత దిల్‌రాజు, ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ సైబ‌ర్ క‌మీష‌న‌ర్‌కు పైర‌సీని అడ్డుకోవాల‌ని పిర్యాదు చేశారు. పిర్యాదుపై స్పందించిన క‌మీష‌న‌ర్ వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హ‌మీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here