మాకేంటి ఈ టార్చర్ – ఫ్రస్టేషన్ లో మహేష్ ఫాన్స్

స్పైడర్ సినిమా మొదలైన వేళా విశేషం ఏమో కానీ ఈ సినిమా షెడ్యూల్ దగ్గర నుంచీ ఏదీ సరిగ్గా వర్క్ కాలేదు. జనవరి లో పూర్తి అయ్యి ఏప్రిల్ లో రావాల్సిన సినిమా ఇంకా రాలేదు. ఇప్పటికీ షూటింగ్ విషయం లో అనేక సంశయాలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ దగ్గర నుంచీ ఈ సినిమాకి సంబంధించి అన్ని విషయాల్లో బోలెడంత ఆలస్యం జరుగుతోంది. రిలీజ్ డేట్ విషయం లో కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. చివరికి సెప్టంబర్ నెలాఖరు లో స్పైడర్ రాబోతోంది అని స్వయంగా మహేష్ ప్రకటించాడు.

అయితే ఈ డేట్ మీద కూడా ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి. బాలయ్య పైసా వసూల్ చిత్రం సెప్టెంబర్ 29 న రాబోతోంది. మరొక పక్క జై లవకుశ చిత్రం 21 సెప్టెంబర్ ర రానుంది. దీంతో ‘స్పైడర్’ దసరాకే వస్తుందా లేక వాయిదా ఏమైనా పడుతుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. దీపావళి కి వస్తుంది అంటూ కొత్త వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మహేష్ ఫాన్స్ లో మళ్ళీ ఈ విషయం మీద కలవరం మొదలైంది. విడుదల తేదీలు ఎన్ని సార్లు మారుస్తారు  ? ఈ టార్చర్ ఏంటి మాకు అంటూ మహేష్ ఫాన్స్ యమా సీరియస్ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here