బాబు.. బాబ్బాబు.. దొందు దొందే

తండ్రి కోనేరు మెట్ల మీద ఏదో చేస్తె.. కొడుకు కోనేరు లోపల ఇంకేదో చేశాడని వెనకటికి ఓ సామెత ఉంది. దాన్ని నిజమే అని నిరూపిస్తున్నారు.. తండ్రీ కొడుకులైన చంద్రబాబు, లోకేష్ బాబులు. అంటే అన్నారంటారు కానీ.. నోటికొచ్చినట్టు మాట్లాడ్డం అలవాటైపోయిన మన ముఖ్యమంత్రి, మంత్రి వర్యులు బాబు, లోకేష్.. ఎవరు ఎంత విమర్శించినా.. సోషల్ మీడియాలో ఎంతగా జోకులు పేలుతున్నా.. తీరు మాత్రం మార్చుకోలేకపోతున్నారు.

షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కు విజయవాడలో సన్మానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తనకు సహజంగానే ఉండే అతి ఉత్సాహంతో.. ఆవేశం ఆపుకోలేకపోయారు. ఒలింపిక్స్ లో గెలువు.. నోబెల్ బహుమతి ఇస్తా అని.. స్టేజ్ పై అనేశారు. దీంతో.. అంతా నోరెళ్లబెట్టారు. ఒలింపిక్స్ కు.. నోబెల్ బహుమతికీ సంబంధం లేకుండా ముడిపెట్టిన ఆయన తీరుకు.. నిద్రలో కూడా నవ్వుకుంటున్నారు. అది కూడా.. తానే ఇస్తా అనేసరికి.. జనానికి మతిపోతోంది.

ఇప్పుడే కాదు.. గతంలో కూడా.. బాబు ఇలాగే వ్యవహరించారు. 2018లో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తా అన్నారు. ఆలూ లేదు..చూలూ లేదు కొడుకు పేరు.. ఇంకేదో అన్నట్టు.. రాజధాని నిర్మాణమే ఇంకా పూర్తి కాలేదు.. అంతలోనే ఒలింపిక్స్ నిర్వహించుకుందాం అనడంతో.. బాబు పరువు గంగలో కలిసింది. అంతే కాక.. 8 ఏళ్ల ముందే.. ఒలింపిక్స్ కు వేదిక ఖరారు అవుతుంది. దీనికి బిడ్ వేసే క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండదు.

తిరుపతి సైన్స్ కాంగ్రెస్ లో బాబు అన్నమాటను కూడా చరిత్రాత్మకమే. నోబెల్ బహుమతి సాధిస్తే.. వంద కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తా అంటూ.. పిల్లలను ఉత్సాహపరిచిన బాబు.. తర్వాత విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. యూనివర్సటీల్లో పరిశోధనలకు పైసా విదిల్చరు.. వేదికలపై ఇలా మాట్లాడతారు.. అని బాబు తీరును అంతా తప్పుబట్టారు. ఇప్పుడేమో.. ఒలింపిక్స్ గెలిస్తే.. నోబెల్ ఇస్తా అంటున్నారు.

బాబుకు పోటీగా.. లోకేష్ .. చాలాసార్లు నోరు జారారు. తండ్రితో పాటే.. ఒకేరోజు తన రికార్డును మెరుగుపరుచుకున్నారు. ఢిల్లీకి వెళ్లిన మన మంత్రివర్యులు లోకేష్ గారు.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. అప్పుడు మాట్లాడుతూ.. మన తెలుగుదేశం నుంచి ప్రధాని అయిన పీవీ.. అని పొరపాటులే అలవాటుగా.. కామెంట్ చేశారు. తర్వాత.. అదే అలవాటుగా.. మళ్లీ సరిచేసుకున్నారు.

ఇలా.. తండ్రీ కొడుకులు.. ఇద్దరూ కలిసి.. తమ కామెంట్లతో.. జనాల్లో పరువు పోగొట్టుకుంటున్నారు. ఈ తీరు ఎప్పుడు మారుతుందో ఏమో.. బాబు.. బాబ్బాబుకే ఎరుక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here