పవన్ కళ్యాణ్ చేసిన తప్పే చేస్తున్న ఎన్టీఆర్ ..

రచయితగా చాలా సార్లు సత్తా చాటిన డైరెక్టర్ బాబీ పవర్ అనే సినిమా తప్ప పెద్ద హిట్ కొట్టలేదు ఎప్పుడూ .. పవర్ సినిమా కూడా విక్రమార్కుడు కథ ని అటూ ఇటూ తిప్పి కథ నడిపించాడు. పవర్ ని యావరేజ్ అన్నా కూడా పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కంది బాబీ కి. సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ గబ్బర్ సింగ్ కి సీక్వెల్ మొదలు పెట్టిన బాబీ పవన్ కళ్యాణ్ సినిమా లో వేలు పెట్టడం తో తీవ్ర అసహనానికి గురి అయ్యాడు అని అప్పట్లో టాక్ ఉండేది. ఆ సినిమా ఎలాగు డిజాస్టర్ అయినా కూడా ఎన్టీఆర్ బాబీ కి ఛాన్స్ ఇచ్చాడు.

ఎన్టీఆర్ తో త్రిపాత్రాభినయం చేయిస్తున్న బాబీ ఎన్టీఆర్ ని దాదాపు ఎనిమిది నెలల టైం ఇచ్చాడు. ఎన్టీఆర్‌ అందుకు సరేనన్నాడు కానీ అనుకున్న రీతిన షూటింగ్‌ ముందుకి సాగడం లేదు. అయితే ఇది తన సోదరుడు కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తోన్న చిత్రం కావడంతో షూటింగ్‌లో డిలేని ఎన్టీఆర్‌ తేలిగ్గా తీసుకోవడం లేదు.ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చెయ్యాలనే తాపత్రయం లో ఎన్టీఆర్ కూడా ఈ సినిమా వ్యవహారం లో కాస్తంత వేలు పెడుతున్నట్టు చెబుతున్నారు. సీజన్ అడ్వాంటేజ్ గా వస్తున్న దసరా టైం ని మిస్ అవ్వకూడదు అనేది ఎన్టీఆర్ ప్లాన్. అందుకే పవన్ లాగా సినిమా విషయం లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడట తారక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here