” ఏంటి ఎమ్మెల్యే గారు నన్ను తప్పించుకుని తిరుగుతున్నారు “

విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడం కోసం గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వచ్చారు టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయనతో పాటు రెండు మూడు వాహనాల్లో ఆయన అనుచరులు కూడా విమానాశ్రయానికి వచ్చారు. అయన తన వాహనం దిగి ఎయిర్ పోర్ట్ లాంజ్ కి వెళుతున్న టైం లో వైకాపా ఎమ్మెల్యే రోజా ఎదురు అయ్యారు. ఆమెని చూడగానే తన అనుచరులతో కలిసి రెండడుగులు వెనక్కి వచ్చిన వంశీ ఆమె తమవైపే వస్తూ ఉండడం తో అనుచరులతో సహా ఆయన ఎయిర్ పోర్ట్ బయటకి వచ్చేసారు. ఇదంతా చూసిన రోజా లోపలే ఉండిపోయారు.

కాసేపటికి వంశీ ఫ్లైట్ ఎక్కడం అదే ఫ్లైట్ లో రోజా కూడా కనపడ్డం అనుకోకుండా జరిగింది.  ఈ సందర్భంగా ఆయనను చూసిన రోజా, “ఏంటి వంశీగారు, తప్పించుకుని తిరుగుతున్నారు?” అంటూ నవ్వుతూ ప్రశ్నించారట. ” లేదండీ అనుచరులతో మాట్లాడుతూ ఉన్నాను. ” అని చెప్పారట. రోజా తో ఏది మాట్లాడినా ఈ రోజుల్లో మీడియా లో సంచలనం అవుతోంది కాబట్టి కాస్త దూరంగా ఉంటె బెటర్ అనుకున్నట్టు ఉన్నాడు వంశీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here