నా గురించీ నా కూతురు గురించీ తప్పుగా రాసారు – స్టార్ హీరో గోల

తన కూతురు సారా ఆలీఖాన్ సినిమా రంగ ప్రవేశం మీద మీడియా కథనాలు రావడం చూసి షాక్ అయ్యాను అన్నాడు హీరో సైఫ్ ఆలీఖాన్. మీడియా ప్రముఖంగా ఈ మధ్య కాలం లో సైఫ్ కూతురు సినిమాల్లోకి రావడాన్ని అడ్డుకున్నాడు అనే వార్తలు రాసింది. దీనికి సంబంధించి మీడియా మెడ ఫైర్ అయ్యాడు సైఫ్. తండ్రిగా తన కూతురు మంచిని తాను కోరుతాను అనీ ఆ విషయం మీడియా కూడా అర్ధం చేసుకోవాలి అని కోరాడు.

సారా సినీ రంగ ప్రవేశంపై తనకు అమృతాసింగ్‌ తో విభేదాలు వచ్చాయని, అమృత ఆమె సినీ రంగప్రవేశాన్ని స్వాగతిస్తున్నట్టు, తాను వ్యతిరేకించినట్టు వార్తలు వచ్చాయని, అవన్నీ అవాస్తవాలని తేల్చిచెప్పాడు. | ఆమె నేను మా కూతురు భవిష్యత్తు గురించి ముఖ్యంగా ఆమె బాలీవుడ్ పయనం గురించి ఒకే అభిప్రాయం తో ఉన్నాం. ” అన్నాడు సైఫ్. తండ్రిగా ఒక పక్క హీరోగా ఒక పక్క ఆమె బాలీవుడ్ లోకి రావడం తనకి ఫుల్ హ్యాపీ అన్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here