‘ఆ హీరో కారణంగానే నా జీవితం ఇలా అయ్యింది. పెళ్లి కూడా చేసుకోలేదు’

సాధారణంగా హీరో హీరోయిన్ ల మధ్యన చనువు, ప్రేమ , పెళ్లి , స్నేహం ఇవన్నీ మామూలే. బాలీవుడ్ లాంటి చోట అయితే అఫైర్ లకి అసలు కొదవే లేదు. అయితే అజయ్ దేవగన్ మీద తనకున్న ప్రేమని ఇన్నేళ్ళ తరవాత బయట పెట్టింది నటి టాబూ. ఒకప్పుడు తన కజిన్ ఇంటి దగ్గరే అజయ్ దేవగన్ ఉండేవాడు అనీ తామందరం మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం అనీ చెప్పిన టబూ అజయ్ కి తానంటే ఎంత ఇష్టమో అప్పట్లోనే తెలిసింది అంటోంది. తాను ఎక్కడికి వెళ్ళినా ఫాలో అయిన అజయ్ దేవగన్ ఇతర మగాళ్ళు టాబూ ని ఏడిపిస్తే కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయ్ అంది.

” నాకు పెళ్లి కాకపోవడానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం అజయ్ దేవగన్ మాత్రమే. ఈ విషయం అతను ఇప్పటికైనా గుర్తించాలి అని నా కోరిక. హీరోలలో కూడా అజయ్ అంటేనే నాకు చాలా ఇష్టం. నన్ను కేర్ చేసిన వ్యక్తులలో అతనిదే పై స్థానం” అంటోంది టాబూ. ప్రస్తుతం అజయ్ దేవగణ్ సినిమా ‘గోల్ మాల్ ఎగైన్’లో టబూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here