ఈ పరికరం ఉంటె చార్జింగ్ తో ఇబ్బందేమీ ఉండదు

తిండీ నిద్రా లేకపోయినా స్మార్ట్ ఫోన్ లేకపోతే ఈ కాలం యువత ప్రశాంతం గా ఉండలేకపోతున్నారు. ఇరవై నాలుగు గంటలూ ఫోన్ లో గడిపే ఈ యువత కి ఎప్పుడూ చార్జింగ్ తోనే తలకాయ నొప్పి. స్మార్ట్ ఫోన్ తో గంటలు గంటలు సావాసం చేసే వీరికి అదొక్కటే ఇబ్బంది. డుయల్ బ్యాటరీ లు ఉన్నా, పవర్ బ్యాంక్ లు ఉన్నా కూడా వాటి లో ఉండే పవర్ వారికి సరిపడడం లేదు కూడా.

ఇప్పుడొక కొత్త పరికరం తో కెనడా కి చెందిన ఒక సంస్థ ముందరకి వచ్చింది. తాము తయారు చేసిన పరికరం బ్యాగులో ఉంటే ఆ పరికరాలతో పని లేదని కెనడాకు చెందిన సీఫార్మిటిక్స్ అనే సంస్థ చెబుతోంది. దీనికి వాటర్ లీలీ అనే పేరు పెట్టారు. వీచే గాలి, పారే నీటి తో విద్యుత్ సంపాదించుకుని దానితో బ్యాటరీ నింపడం అనేది ఈ పరికరం స్పెషాలిటీ. ఇది చాలా నెమ్మదిగా పారే నీటిలో కూడా 25వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. దీన్ని పవర్ బ్యాంక్ లాగా వాడుకోవాలి దీన్ని అటాచ్ చేస్తే ఫోన్ కి బ్యాటరీ ఇబ్బంది ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here